Monday, January 13, 2025

ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్‌కు చోటు కల్పించనున్నారు. 2028లో జరిగే లాస్‌ఏంజిల్స్ వేదికగా సాగే ఈ విశ్వ క్రీడల్లో ఈ జెంటిల్మెన్ ఆటను కనిపించనున్నది. కాగా, 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు అవకాశం కల్పించే అంశంపై గురువారం చర్చలు జరిగిగాయి. ఈ చర్చలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐసిసి చైర్మెన్ జైషా హాజరయ్యారు. బ్రిస్బేన్ ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులతో ఆయన చర్చించారు.

సమ్మర్ క్రీడల్లో ఒలింపిక్స్‌ను జోడించాలా వద్దా అన్న అంశంపై షా సమాలోచనలు జరిగిపారు. లాస్ ఏంజిల్స్ క్రీడలకు ఓకే చెప్పినా.. బ్రిస్బేన్ క్రీడలకు ఇంకా అనుమతిరాలేదు. అయితే బ్రిస్బేన్ అధికారులతో జరిగిన చర్చకు సంబంధించిన వీడియోను షా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బ్రిస్బేన్ ఆర్గనైనింగ్ కమిటీ చీఫ్ సిండీ హుక్, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హక్లే ఆ మీటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. శనివారం నుంచి ఆస్ట్రేలియాతో గబ్బా స్టేడియంలో జరిగే మ్యాచ్‌ను జే షా వీక్షించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News