Sunday, November 3, 2024

బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల ఒప్పందం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడానికి, తన స్థాయిన బలహీన పరచడానికి బిజెపి, బిఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అలాంటి యత్నాలను విఫలం చేయాలని, 14 లోక్ సభ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం కావాలంటే తనను బలోపేతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కొడంగల్ లో సోమవారం మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానిక నాయకులు, క్యాడర్ లతో సన్నదత సమావేశం నిర్వహించినప్పుడు ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని అన్నారు. ‘‘ఒకవేళ తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లను అందిస్తే, కేంద్రం నుంచి అధిక నిధులు మన రాష్ట్రానికి అందే అవకాశం ఉంటుంది. అభివృద్ధి వేగవంతం కాగలదు. కానీ బిజెపి, బిఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ను ఓడించే కుట్ర చేస్తున్నాయి. నన్ను బలహీన పరచడానికి ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి’’ అని రేవంత్ వివరించారు.

కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ను 50000 మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ‘‘కొడంగల్ లో, రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను దెబ్బతీస్తే రాష్ట్రంలో నన్ను బలహీన పరచొచ్చని ఆ పార్టీలు కలలు కంటున్నాయి. కొడంగల్ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. కొడంగల్ లో కాంగ్రెస్ కు తక్కువ మెజారిటీ వచ్చిందంటే, పార్టీ మాత్రమే కాదు, కొడంగల్ అభివృద్ధి కూడా దెబ్బతినగలదు. కొడంగల్ ఆత్మ గౌరవం కూడా దెబ్బ తినగలదు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News