Thursday, December 26, 2024

ఐపిఎస్ లలో కీలక మార్పులు

- Advertisement -
- Advertisement -

రేవంత్ సెక్రటరీగా ఐపిఎస్ అధికారి షా నవాజ్ ఖాసిం
ట్రై కమిషనరేట్ల కొత్త పోలీసు బాస్‌లుగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సుధీర్‌బాబు, అవినాశ్ మహంతి
నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య
ఐఎఎస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున బదిలీ అయ్యే ఛాన్స్!?

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు అమలుతో పాటు .. ఇటు పాలనాపరమైన పలు చర్యలకు శరవేగంగా శ్రీకారం చుడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే సిఎం రేవంత్ పాలనలో తనదైన ముద్ర కన బర్చే దిశగా దూకుడుగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో పోలీస్ శాఖలో రేవంత్ సర్కార్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.

సిఎం రేవంత్‌రెడ్డి సెక్రటరీగా ఐపిఎస్ అధికారి షానవాజ్ ఖాసింను నియమించారు. ఈ మేరకు రేవంత్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం షాన్‌వాజ్ ఖాసిం హైదరాబాద్ రేంజి ఐజిగా ఉన్నారు. మరోవైపు కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ సిపిగా అవినాశ్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్‌బాబును నియమించింది. హైదరాబాద్ పాత సిపి సందీప్ శాండిల్యను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ చేసింది. ఇప్పటి వరకూ సైబరాబాద్ సిపిగా ఉన్న స్టీఫెన్ రవీంద్ర , రాచకొండ సిపిగా ఉన్న దేవేంద్ర సింగ్ చౌహాన్‌లను డిజిపి ఆఫీస్‌కు ఎటాచ్ చేశారు. నిజానికి హైదరాబాద్ సిపిగా ఉన్న సివి ఆనంద్‌ను ఎన్నికల కోడ్ ప్రారంభమయ్యాక ఇసి బదిలీ చేసింది. ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. ఇప్పుడు ఆయనకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్‌గా బదిలీ ఆదేశాలు అందాయి.

సిఎం రేవంత్‌రెడ్డి డ్రగ్స్ విషయంలో పూర్తిస్థాయిలో కట్టడి చర్యలు తీసుకోవాలను కుంటున్నందున సందీప్ శాండిల్యకు కీలకమైన బాధ్యతలే వచ్చాయని భావిస్తు న్నారు. ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసుకుంటారు. గత ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో ఉన్న వారిని లూప్‌లైన్‌కు పంపి అప్పటి వరకూ లూప్‌లైన్‌లో ఉన్న వారికి ప్రాధాన్యత పోస్టులు ఇస్తుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నా అప్పటివరకూ ప్రభుత్వంలో ఉన్న వారికి సన్నిహితులని భావిస్తారు. అంతేకాదు ఎన్నికల సమయంలోనూ వారే విధులు నిర్వహించి ఉంటారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆయనను సైబరాబాద్ కమిషనర్ నుంచి తప్పించి డిజిపి ఆఫీసుకు ఎటాచ్ చేశారు. ఆయనకు ఏదైనా ప్రాధాన్యమైన పోస్టింగ్ లభిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

ఐఎఎస్ అధికారులను కూడా భారీగా బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా బదిలీలతో పోలీసు ఉన్నతాధికారుల్లో సిఎం రేవంత్ వైఖరి ఏంటో అర్థం అయింది. రెండు రోజుల్లో ఐజి నుంచి ఎస్పీల వరకు బదిలీలు జరుగుతాయని తెలిసింది. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగిన అధికారులకు కొందరికి ఇబ్బందులు ఉండకపోవచ్చని అంటున్నారు. డిజిపి రవిగుప్తాను కూడా త్వరలో మార్చనున్నారని విశ్వసనీయ సమాచారం. మరో ఐదు నెలలో సర్వీస్ ఉండటం లోక్‌సభ ఎన్నికల సమయంలో కొత్తవారు వస్తే ఇబ్బందికరమని, ఇప్పుడే పూర్తిస్థాయి డిజిపిని నియమించాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నారని తెలిసింది. ఈ పదవుల పందెరం చూస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో సిఎం కెసిఆర్ కూడా ఈ మాదిరే సమర్థులైన అధికా రులతో టీం తయారు చేసినా రెండో దఫా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నలుగురితో నారాయణ అన్నట్లు కెసిఆర్ ప్రభుత్వం వ్యవహ రించిందనే ఆరోపణలున్నాయి. కెసిఆర్ ప్రభుత్వంలో పోలీసు శాఖలో కొంతమందికే అందలాలు దక్కాయని అపవాదు ంది. కావాల్సిన అధికా రులకు అదనపు బాధ్యతలతో అప్పగిస్తే మరికొందరిని నెలల తరబడి వెయిటింగ్‌లో ఉంచారు. పదోన్నతులు ఇచ్చినా పాత బాధ్యతల్లోనే కొనసా గించటం జరిగింది. ముఖ్యంగా ఎస్‌ఐ, సిఐల బదిలీల్లో ఎంఎల్‌ఎల సిఫారసులు తప్పనిసరి చేయటంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పోలీసు అధికా రులు సమర్థవంతంగా విధులు నిర్వహించలేకపోయారనేది వాస్తవం. దీంతో చట్టం కొందరికి చుట్టంలా మారిపోయిందన్న విమర్శలు వినవచ్చా యి. కాగా, తొలి నుంచే దూకుడు వైఖరిని అవలంబిస్తున్న సిఎం రేవంత్‌రెడ్డి పోలీసు శాఖలో పూర్తిస్థాయి సంస్కరణలు తీసుకొచ్చి గత ప్రభుత్వా నికి భిన్నంగా వ్యవహరించే అవకాశం మెండుగా ఉందని పోలీసు వర్గాల ఉవాచ.

transfer 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News