Thursday, January 9, 2025

ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. చీఫ్ సెక్రటరీ సహా ముఖ్యమైన కొందరు అధికారులను వెంటబెట్టుకుని వెళ్లడంతో ఆయన ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి వెంట వెళ్లిన అధికారుల బృందంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపి రవిగుప్తా తదితరులు ఉన్నారు.

రేవంత్ ఈనెల 14న దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఈలోగా కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాన్ని అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నారు. గురువారం ఢిల్లీలో జరిగే ఏఐసిసి సమావేశంలోనూ ఆయన పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ త్వరలో చేపట్టబోయే భారత న్యాయ యాత్రపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News