- Advertisement -
హైదరాబాద్: సింగర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రేవంత్ తండ్రి అయ్యారు. రేవంత్ భార్య అన్విత శుక్రవారం తెల్లవారుజామున పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో రేవంత్‌కు ఆడ పిల్ల జన్మించిందని తెలియగానే అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు పోస్టులు వైరల్‌గా మారాయి. రేవంత్ బిగ్‌బాస్‌లోకి వచ్చేటప్పటికి ఆయన భార్య ఏడు నెలల గర్భిణీగా ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో తన భార్యను తలుచుకొని కొన్ని సార్లు రేవంత్ కన్నీంటి పర్యంతమయ్యారు. బిగ్‌బాస్‌హౌస్‌లోకి కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు తన భార్య వస్తుందని అనుకున్నాడు. కానీ రేవంత్ తల్లి రావడంతో నిరాశ చెందాడు. వీడియో కాల్ లో భార్యతో రేవంత్ ను బిగ్ బాస్ మాట్లాడించాడు. అన్విత సీమంతం కూడా ఘనంగా జరగిన వీడియోను బిగ్‌బాస్ ప్లే చేశాడు.
- Advertisement -