Sunday, December 22, 2024

రేషన్ కార్డు లేని వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు ప్రజాపాలన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరించనుంది. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతీ పౌరుడికి హెల్త్ కార్డులు మంజూరు చేసేందుకు, అలాగే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు అందించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులును ఆదేశించారు.. సచివాలయంలో అధికారులతో పలు శాఖలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా సచివాలయంలో ఆరోగ్య, మున్సిపల్ శాఖలకు సంబంధించి స్పీడ్‌ (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) పై సమీక్షించారు.

ఆయా శాఖల్లో అత్యవసర, ప్రాధాన్యత కలిగిన పనులను గుర్తించి వాటిపై సమీక్ష, తక్షణ నిర్ణయాలు చేయడమే “స్పీడ్” ఉద్దేశం. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం, భూబదలాయింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. 50   ఏళ్లను దృష్టిలో ఉంచుకుని  ఉస్మానియా ఆస్పత్రి నిర్మించాలన్నారు.

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News