Friday, December 20, 2024

దేశంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్

- Advertisement -
- Advertisement -

పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంలు
మహిళా సంఘాలకు స్టిచింగ్ బాధ్యతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నేరవేరబోతోంది. దీంతో రేవంత్ సర్కార్ దేశంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయ్యింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో అందించేందుకు యూనిఫాం స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రణాళిక బద్దంగా వ్యవహరించారు. మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినప్పటి నుంచి, ఎప్పటికప్పుడు అధికారులను, మహిళా సంఘాలను సమన్వయ పరుస్తూ గడువు లోగా పాఠశాలకు యూనిఫాంలు చేరేలా చర్యలు తీసుకున్నారు.

దీంతో మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ లక్షం నేరవేరనుంది. అందుకే స్టిచ్చింగ్ పనులను ముఖ్య్మంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు అప్పగించారు. యూనిఫాం స్టిచింగ్ పనులను దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం అప్పగించినందుకు మంగళశారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి మహిళ సంఘాల తరుపున మంత్రి సీతక్క ధన్యవాదములు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేసేలా వ్యవహరించిన మహిళా సంఘాలు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, కమిషనర్, పిర్ అండ్ ఆర్‌డి, సీఈఓ సర్ప్, కల్లెక్టర్లు, సర్ప్ అధికారులకు, డిఆర్డిఒ, అడిషనల్ డిఆర్డిఒ, డిపిఓలు, సిసిలు, ఇతర అధికారులను మంత్రి సీతక్క అభినందించారు.

పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ కి సిద్దం అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు మొదటి రోజే అందజేస్తారు. గతంలో స్టిచ్చింగ్ పనులను పరిమిత సంఖ్యలో టైలర్లకు అప్పగించడం వల్ల, యూనిఫాంలు ఆలస్యమయ్యేవి. పాఠశాల ప్రారంభమైన మూడు నాలుగు నెలల వరకు విద్యార్థులకు యూనిఫాంలు అందేవి కావు. ఈ సమస్యను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్ పనులను అప్పగించింది. దీంతో పాటు రూ. 50 ఉన్న కుట్టు కూలీని రూ. 75 కు ప్రభుత్వం పెంచింది.

దీంతో మహిళా సంఘాలు యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులను సవాలుగా తీసుకోని, సకాలంలో పూర్తి చేయగలిగాయి. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళా సంఘ సభ్యులు ఉండగా 18,000 విలేజ్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. వారికి 15, 30,603 (ఒక జత) యూనిఫామ్ లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా ఇప్పటివరకు 90 శాతం యూనిఫాంలు సిద్దమయ్యాయి. మహిళా సంఘాలు సహాయకులుగా ఈ పనిని చేసినందుకు ప్రభుత్వం తరుపున మంత్రి వారిని అభినందించారు. ఇందుకు గాను మహిళా సంఘాలకు సుమారు రూ. 50 కోట్ల స్టిచ్చిoగ్ ఆదాయం ప్రతి సంవత్సరం సమకూరుతుంది. భవిష్యత్తులో కూడా మహిళ సంక్షేమా కార్యక్రమాల ద్వారా, మరిన్ని ఆదాయం పరమైన పనులు అప్పగించడం జరుగుతుందని మంత్రి అన్నారు. దానితో పాటు రెండవ జత, వారికి అందజేయడానికి సందిద్దంగా ఉన్నామన్నారు. మునుముందు ఇతర ప్రభుత్వ స్టిచింగ్ పని కూడా స్వయం సహాయక సంఘాలకు మా ద్వారా అందించబడుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News