Monday, January 20, 2025

రైతు ఆత్మహత్యలపై రేవంత్ పచ్చి అబద్ధాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆత్మహత్యలు జరిగాయని బొంకిన కాంగ్రెస్ నాయకుడు

లోక్‌సభలో ఆయన ప్రశ్నకే కేంద్ర
మంత్రి తోమర్ సమాధానమిస్తూ
తెలంగాణలో రైతు ఆత్మహత్యలు
471కి తగ్గాయని ఇటీవల స్పష్టం
చేశారు మెడికల్ కాలేజీ సీట్ల
భర్తీపై రేవంత్‌వి తప్పుడు
ఆరోపణలు బండికి తెలంగాణ
చరిత్ర తెలియదు ధాన్య
సేకరణపై బిజెపి, కాంగ్రెస్
దురుద్దేశ్యపూర్వకంగా రాద్దాంతం
చేస్తున్నారు టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో
ప్రభుత్వ విప్ బాల్క సుమన్,
ఎంఎల్‌సి గంగాధర గౌడ్‌తో కలిసి
ఏర్పాటు చేసిన మీడియా భేటీలో
రైతుబంధు సమితి అధ్యక్షుడు
పల్లా రాజేశ్వర్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం సేకరణపై బిజెపి, కాంగ్రెస్ నేతలు దురుద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. వారికి కావాల్సింది రైతులను రెచ్చగొట్టడం…టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనామ్ చేయడమేనని మండిపడ్డారు. రాజకీయ కక్షతోనే ఆ పార్టీ నేతలు అసత్య ప్రచా రం చేస్తున్నారని పల్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కేం ద్రం ససమేరా అంటే ప్రభుత్వమే ముం దుకు వచ్చి రూ.3వేల కోట్ల నష్టాన్ని భరించేందుకు సిద్ధపడిందన్నారు. అయినప్పటికీ విపక్ష నేతలు అడుగడుగునా అడ్డంకులు సృ ష్టించేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంఎల్‌సి వి. గంగాధర్ గౌ డ్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజ య్, పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగా జరుగుతోందన్నారు. ఈ విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన లేదని… ఉన్నదంతా విపక్షనేతలకేనని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల నేతలు రైతులకు శాపంలా మారారని అన్నారు.

వారు ఇలాగే వ్యవహరిస్తే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నలుగురు బిజెపి ఎంపిలు ధాన్యం సేకరణకు అడ్డు పడుతూ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్నారన్నారు. పారబాయిల్డ్ సమస్య ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లో కూడా ఉందని ఆ రాష్ట్రాల ఎంపిలు చెబుతుంటే రేవంత్ సిగ్గు లేకుండా తెలంగాణలోనే ఎందుకు సమస్య అంటున్నారన్నారు. రైతుల ఆత్మహత్యలపై రేవంత్ నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అవాస్తవాలు చెప్పారన్నారు. దీనిపై పార్లమెంట్‌లో రేవంత్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి తోమర్ చాలా స్పష్టంగా తెలంగాణలో ఆత్మ హత్యలు 471కు తగ్గాయని ఇటీవల చెప్పారన్నారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణే చాలా మెరుగ్గా (బెటర్) ఉందన్నారు. ఆయన కు ఇంగ్లీష్, హిందీ భాషా అర్థం కానట్టుందన్నారు. అందుకే రేవంత్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆయన నోటి తీటకు గట్టిగానే బుద్ది చెబుతామని హెచ్చరించా రు. రైతు బీమా మొత్తాన్ని 75వేల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఇచ్చిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

మెడికల్ కాలేజీ సీట్ల భర్తీపై తప్పుడు ఆరోపణలు

మెడికల్ కాలేజి సీట్ల భరీ పై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలతో గవర్నర్‌కు లేఖ రాశారని.. తమ ప్రమేయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రులు పువ్వాడ అజయ్, మల్లా రెడ్డిలు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారని పల్లా అన్నారు. ఇందులో తనపై కూడా రేవంత్ ఆరోపణలు చేశారన్నారు. తనకు మెడికల్ కాలేజి కూడా లేదనే సంగతి రేవంత్‌కు తెలియనట్టుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో ఇలాంటివి జరగడాన్ని అరికట్టేందుకు వైద్య శాఖయే ముందు గా పోలీసులకు సమాచారం ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూ డా స్పష్టమైన జీఓలు ఇచ్చి అవకతవకలు అరికట్టిందన్నారు. మెడికల్ కాలేజి అడ్మిషన్లలో అవకతవకలు అరికట్టేందుకు ప్రభుత్వం సకాలం చర్యలు తీసుకోలేదని రేవంత్ నిరూపించగలిగితే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటానని పల్లా సవాల్ చేశారు. అన్నీ రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు…. ఇలాంటి దందాలు చేస్తుంటాయని….కానీ వాటికి రాష్ట్రంలో స్థానం లేదన్నారు. ఇక రేవంత్ రాజకీయ సన్యాసం మాటలు అన్ని ఉత్తవేనని..గతంలో కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పారని ఈ సందర్భంగా పల్లా గుర్తు చేశారు.

బండికి తెలంగాణ చరిత్ర తెలియదు

పాదయాత్రలో బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలను చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. బిజెపి లేకపోతే టిఆర్‌ఎస్‌కు పదవులు ఎక్కడివని బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అసలు ఆయనకు తెలంగాణ చరిత్ర తెలియని చవట అని వ్యాఖ్యానించారు. త్యాగాలు తెలియని సన్నాసి బండి సంజయ్ అని మండిపడ్డారు. 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని కాకినాడలో తీర్మానం చేసి ఆ తర్వాత తెలంగాణను ఆట కెక్కించింది బిజెపి కాదా? అని ప్రశ్నించారు. 2వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలతో పాటే తెలంగాణను కూడా ఇచ్చి ఉంటె ఇన్ని బలిదానాలు ఉండేవా కావన్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర తెలంగాణ సాధన కోసం జరిగిన ్న ఆత్మహత్యలకు బిజెపియే కారణంగా మారిందన్నారు. టిఆర్‌ఎస్‌ది తెలంగాణ అస్థిత్వం అయితే..బిజెపి నేతలది గుజరాత్ బానిస మనస్తత్వమన్నారు. హంద్రీ నీవాకు హారతులు పట్టిన మాజీ మంత్రి డికె అరుణను వెంట బెట్టుకుని సంజయ్ తెలంగాణకు సాగు నీరు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలకు అంతే లేకుండా పోతున్నదన్నారు. సిరిసిల్ల, గజ్వెల్, సిద్ధి పేట నియోజకవర్గాలకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ అభివృద్ధి కనిపిస్తున్నా కిషన్ రెడ్డికి కనిపించడం లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ధి పల్లెల్లో కనిపిస్తుందా? కేంద్రానికి గుజరాత్ అభివృద్దే కనిపిస్తుందని కిషన్ రెడి కి అనిపించడం లేదా? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా కిషన్‌రెడ్డి పారిపోయారన్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అరవింద్‌తో సహా బిజెపి నేతల నోళ్ళను పినాయిల్ తో కడగాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News