Monday, January 20, 2025

సోనియా ఓకే.. తేల్చని రాహుల్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా మళ్లీ సోనియా ఎన్నిక లోక్‌సభాపక్ష నేతగా బాధ్యత స్వీకరించాలని
సిడబ్లూసిలో తీర్మానం దీనిపై త్వరలో తన నిర్ణయం చెబుతానని పార్టీ అగ్రనేత రాహుల్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీని తిరిగి ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. శనివారం సాయంత్రం పార్లమెం ట్ సెంట్రల్ హాల్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పా ర్టీ సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు పార్లమెంట్ ఉభయసభలలో పార్టీ కార్యకలాపాలను సమన్వయపర్చే బాధ్యతను మరోమారు నిర్వర్తించాల్సి ఉంటుంది. పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ జ రిగింది. ఇందులో ఓ తీర్మానం వెలువరించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని కోరుతూ సభ్యులంతా ఏకగ్రీవం గా ఈ తీర్మానం జారీ చేశారు. అయితే తాను ఈ అంశంపై త్వరలోనే తన నిర్ణయం చెప్పడం జరుగుతుందని రాహుల్ ఈ నేపథ్యంలో పార్టీ ప్రముఖ నేతలకు తెలియచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో లోక్‌సభలో రాహుల్ విపక్ష నేత అవుతారా? లేదా అనేది ఉత్కంఠత కు దారితీసింది. సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలి హోదాలోనే కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపిలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ దశలో ప్రధాని మోడీ వ్యవహారశైలిని తీ వ్రంగా తప్పుపట్టారు.

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో మోడీ రాజకీయంగా, నైతికంగా ఓడినట్లే. దేశానికి పాలనా బాధ్యతల నాయకత్వం వహించే నైతిక హక్కును ఆయన కోల్పోయ్యారని సోనియా వ్యాఖ్యానించారు. ప్రజలు ఆయనను తిరస్కరించారు. పాలనాపగ్గాలు చేపట్టే హక్కు ఆయనకు లేదు. రాజకీయ, నైతిక ఓటమిపాలయ్యారని స్పష్టం చేశారు. వైఫల్యానికి బాధ్యత వహించాల్సింది పోయి ప్రధానిగా మరో మారు ప్రమాణానికి మోడీ ఉవ్విళ్లూరుతున్నారని , ఆదివారం ఈ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకున్నారని, ఇది పూర్తిగా హాస్యాస్పదం అన్నారు. ఆయన తన ధోరణి మార్చుకుంటారని కానీ, ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకుంటారని కానీ మనం ఎవరం భావించడానికి వీల్లేదని, దీనిని మనమంతా చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నామని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రచారం దశలో ఆయన పూర్తి స్థాయిలో తన తరఫునే రంగంలోకి దిగాడని, చివరికి పార్టీ లేదా మిత్రపక్షాలను కూడా దూరం పెట్టారని, మరి ప్రజా తీర్పు ఆయనకు షాక్ నిచ్చిందని సోనియా తెలిపారు. అందరికి అతీతంగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఇతరుల అండదండలతో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారని విమర్శించారు. తిరిగి మోడీ ప్రభుత్వం వస్తున్న దశలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులుగా మనమతా మరింత జాగరూకతతో ఉండాలి. అనుక్షణ అప్రమత్తత అవసరం.

ఆయనను అదుపులో పెట్టేందుకు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆయన సరికొత్త ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు , తప్పులు జరిగితే బాధ్యత వహించేలా చేసేందుకు సిద్ధం కావాలని సోనియా పిలుపు నిచ్చారు. పార్లమెంట్‌లో మోడీ హయాంలో పలు విధాలుగా సయ్యాటల తంతు జరిగింది. దశాబ్ధకాలంగా పార్లమెంట్‌లో బుల్‌డోజింగ్ వ్యవహారం చోటుచేసుకుంది. సభ్యులను అవమానపర్చడం, సరైన వివరణకు చర్చకు అవకాశం ఇవ్వకుండానే సభ్యులను సభల నుంచి వెలివేయడం వంటి ఘటనలు అనేకం జరిగాయని తెలిపారు. లోక్‌సభలో ఈసారి కాంగ్రెస్ బలం పెరిగింది. తోడుగా ఇండియా కూటమి మిత్రపక్షాల బలం కూడా నిలిచింది. ఇప్పుడు సభలో విపక్షానిది అతి పెద్ద దళం అయిందన్నారు. భారత్ జోడో యాత్రలు రెండు కూడా చారిత్రక ఉద్యమ ఘట్టాలే అన్నారు. పలు రకాలుగా రాజకీయ వ్యక్తిగత అసాధారణ విమర్శలు, దాడులకు గురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన రాహుల్‌కు ఈ నేపథ్యంలో ప్రత్యేక అభినందనలు అని ఎంపిల చప్పట్ల నడుమ సోనియా తెలిపారు.

పార్టీ తరఫున గ్యారంటీలు, రాజ్యాంగ పరిరక్షణకు ఆయన చేసిన ప్రసంగాలు అత్యంత పదునుగా ప్రజలలోకి వెళ్లాయని కొనియాడారు. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో పార్టీ పరిస్థితి ఆశించిన దాని కన్నా పేలవంగా ఉందని , ఈ కొట్టొచ్చే లోపంపై ఎంపిలంతా ప్రత్యేకంగా దృస్టి సారించాల్సి ఉందని ఆమె హెచ్చరించారు. పరిస్థితిని మెరుగుదిద్దేలా చేసేందుకు ఏమేమీ చేయాల్సి ఉంటుందనేది గ్రహించాల్సి ఉంటుందన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ పేరును పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రతిపాదించారు. దీనిని గౌరవ్ గగోయ్, కె సుధాకరణ్ , తారీఖ్ అన్వర్ బలపర్చారు. దీనితో ఇప్పుడు రాజ్యసభ ఎంపిగా ఉన్న 77 సంవత్సరాల సోనియా గాంధీ తిరిగి పార్లమెంటరీ నేతగా అయ్యేందుకు మార్గం సుగమం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News