Sunday, December 22, 2024

కనకపు సింహాసనంపై రేవంత్!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీమానా చేసిన మాజీ టిపిసిసి అధ్యక్షులు, మా జీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు బిఆర్‌ఎస్ నుంచి ఆహ్వానం అందించింది. బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు శనివారం స్వయంగా పొన్నాల లక్ష్మయ్య నివాసానికి వెళ్లి పార్టీలోకి రావాలని  ఆహ్వానించారు. కెటిఆర్ వెం ట దానం నాగేందర్, శా నంపూడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్ వెళ్లారు. సందర్భంగా పొన్నాల నివాసం వద్దకు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నా రు. జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా అంటూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి పొ న్నాల లక్ష్మయ్యతో భేటీ అనంతరం మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.
సిఎం కెసిఆర్ సూచన మేరకు పొన్నాల లక్ష్మయ్యను ఆ హ్వానించామని అన్నారు. జనగామలో జరిగే బహిరంగ సభలో బిఆర్‌ఎస్ పా ర్టీలో చేరాలని కోరగా ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. ఆదివారం సిఎం కెసిఆర్‌తో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల చెప్పారని పేర్కొన్నారు. బలహీనవర్గాలకు చెందిన అనేక మంది నాయకులకు ఇప్పటికే సిఎం కెసిఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం. ప్రాధాన్యం ఇస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని పేర్కొన్నారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి.. నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఇంజినీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల ల క్ష్మయ్య అని, మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవ చేశారని మంత్రి తెలిపారు.
రేవంత్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు..?
వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, బలహీన వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడిని పట్టుకుని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తూలనాడిన విధానం దిగజారుడు సంస్కారానికి నిదర్శనమని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. చచ్చే ముందు పార్టీ మారడం అని అనడమేందని ప్రశ్నించారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలుసు…? …ఇది మంచి పద్ధతి కాదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారాడు..? అని నిలదీశారు. మొదట బిజెపి ఆర్‌ఎస్‌ఎ స్, తర్వాత టిఆర్‌ఎస్… ఆ తర్వాత తెలుగుదేశం, ఇప్పు డు కాంగ్రెస్.. రేపు.. ఏ పార్టీలోకి వెళ్తారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
అలాంటి వ్యక్తి కూడా పెద్ద పెద్ద మా టలు మాట్లాడితే చూసే వాళ్లు నవ్వుకుంటున్నారని విమర్శించారు. కనకపు సింహాసనంపై ఓటుకు నోటు కేసు దొంగను కూర్చోబెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ.. సీనియర్ నేతలకు కనీసం అపాయింట్‌మెంట్, గౌరవం కూడా ఇవ్వడంలేదని మంత్రి కెటిఆర్ విమర్శించారు.
సిఎంను కలిసిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తా :పొన్నాల
మంత్రి కెటిఆర్ వచ్చి తనను బిఆర్‌ఎస్ ఆహ్వానించారని పొన్నాల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసేందుకు రావాలని కోరారని తెలిపారు. ఆదివారం సిఎంను కలిసిన తర్వాత వివరాలు తెలియజేస్తానని స్పష్టం చేశా రు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతానికి తాను చేసిన సేవలను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చే శారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఐకమత్యమే పార్టీ బలమని, ఈ విషయం రే వంత్ రెడ్డి మర్చిపోయారని దుయ్యబట్టారు. రాజకీయా ల్లో పదవులు కో -ఆర్డినేషన్ కోసం మాత్రమే అని, రేవంత్ లాంటి దౌర్భాగ్యుడి గురించి తాను మాట్లాడానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చాక అయన ఎంఎల్‌ఎగా ఎందుకు గెలవలేదు..? అని ప్రశ్నించారు.పార్టీలో తానొక్కడ్నే ఓటమి పాలయ్యా నా..?, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ భార్య ఓడిపోలేదా..? అని నిలదీశారు. అవమానాన్ని భరించలేకే పార్టీని వీడానని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News