- Advertisement -
హైదరాబాద్: మెదక్ చర్చి వందేళ్ల వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ లోని కేథడ్రల్ చర్చిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చిలో పలు అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా రేవంత్ మాట్లాడారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది మళ్లీ ఈ చర్చికి వస్తానని, మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలన్నారు.
- Advertisement -