Sunday, December 22, 2024

21ఏళ్లకే ఎంఎల్‌ఎలుగా పోటీకి సవరణ తీసుకురావాలి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 25 ఏళ్లకు బదులుగా 21 ఏళ్లు నిండిన వారికి ఎంఎల్‌ఎలుగా పోటీ చేసే అవకాశం ఉండేలా సవరణ తీసుకురావాలని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ తరపున తాము చేయాల్సిన కృషి చేస్తామని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా దేశ గౌరవాన్ని ప్రపంచం దేశాల ముందు తలెత్తుకునేలా చేశారన్నారు. దేశ భవిష్యత్తు యువకులదే అని గుర్తించిన నేత రాజీవ్‌గాంధీ. 21 సంవత్స రాలకు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించి హక్కు కల్పించిన గొప్పనేత రాజీవ్ అని కొనియాడారు.

మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హను మంతరావు ఆహ్వానం మేరకు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. అదే విధంగా అందరిలో స్ఫూర్తి నింపడానికి క్రికెట్ పోటీలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వి.హనుమంతరావు(విహెచ్) నిర్వహిస్తున్నారన్నారు. ఎన్నో ఇబ్బందులున్నా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ఓటమిని కూడా గెలుపుకు పునాదిగా మార్చుకునే స్ఫూర్తి క్రీడా మైదానంలోనే ఉంటుందన్నారు. అలాంటి స్ఫూర్తి రాజకీయాల్లోనూ ఉండాల్సిన అవసరం ఉందని, గెలిస్తే ఓడిపోవద్దు.. ఓడితే కుంగిపోవద్దన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News