Sunday, December 22, 2024

జూపల్లి, పొంగులేటి నాకు స్నేహితులు :రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు తనకు పాత మిత్రులేనని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పారు. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తనతో సహచర ప్రజా ప్రతినిధిగాఉన్నాడని ఆయన గుర్తు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు తెలుసునన్నారు. సోమవారం హైద్రాబాద్ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావుల ఇళ్ల వద్దకు తాను వెళ్తానో , వారే తమ పార్టీ ఆఫీసుకు వస్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుందని చెప్పారు. కాంగ్రెస్, బిజెపిల నుండి ఈ ఇద్దరు నేతలకు ఆహ్వానాలున్నాయి. కానీ ఏ పార్టీలో చేరే విషయమై వీరిద్దరూ ఇంకా ప్రకటించలేదు. సస్పెన్షన్ విధించిన తర్వాత బిఆర్‌ఎస్‌పై జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News