Wednesday, January 22, 2025

రేవంత్‌కు అదనపు భద్రత ఎందుకు? : హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో పోలీసు భద్రత ఉన్నప్పుడు, అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందదని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు భద్రత కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారించారు. ప్రభుత్వ న్యాయవాది ఎం. రూపేందర్ ముందు తన వాదనలు వినిపిస్తూ, రేవంత్ పాదయాత్ర చేసే ప్రాంతాల్లో భద్రత కల్పించాలని సంబంధిత జిల్లా ఎస్పీలకు డిజిపి ఆదేశాలు జారీచేశారన్నారు. అందువల్ల రేవంత్‌కు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్నారు. ఇంటెలిజెన్స్ అదనపు డిజిపి పంపిన సమాచారాన్ని హైకోర్టుకు నివేదించారు.

ఇరుపక్షాల వాదనలు విన్నాక పిటిషన్‌పై ఇంకా వాదనలు కొనసాంగించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయానికి కోర్టు వచ్చింది. ఈ దశలో రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది టి. రజనీకాంత్ రెడ్డి కలుగజేసుకుని అదనపు భద్రతకు ఉత్తర్వు ఇవ్వాలని కోరారు. కాగా విచారణను మార్చి 6వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా సిరిసిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రేవంత్ రెడ్డికి చెందిన నాలుగు కార్లతోపాటు రెండు న్యూస్ ఛానళ్ల కార్లు ధ్వంసమయ్యాయి. కార్లలోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అయితే కాన్వాయ్‌లోని ఒక కారులో ప్రయాణిస్తున్న మీడియా రిపోర్టర్లు గాయపడినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News