Thursday, January 23, 2025

హౌస్ అరెస్టులో రేవంత్ రెడ్డి, హనుమంత రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధర్నా చౌక్‌లో ధర్నాను చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ పిసిసి చీఫ్ ఎ.రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావులను, ఇతర పార్టీ నాయకులను సోమవారం హౌస్ అరెస్టులో పెట్టారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులను మోహరించి సెక్యూరిటీ పెంచారు.

గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున వారికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. దీనికి ముందు ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

పిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపి వి.హనుమంత రావు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు ఎం. కొండా రెడ్డి, మరి కొందరిని హౌస్ అరెస్టులో ఉంచారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన బడ్జెట్ వాటాను సర్పంచ్‌లే ఉపయోగించేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News