Sunday, December 22, 2024

ఓటేసిన రేవంత్, కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా తన స్వగ్రామం చింతమడకలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రాఘురాం రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్,  మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ మల్ రెడ్డి అనురాధ రాంరెడ్డి, తదితరలు ఓటు హక్కును వినియోగించుకన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News