Friday, January 24, 2025

నర్సంపేటకు వెళ్తుండగా రేవంత్ రెడ్డి అరెస్టు…

- Advertisement -
- Advertisement -

 

Revanth Reddy arrested in Ghatkesar

మేడ్చల్: ఘట్కేసర్ వద్ద టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.  నర్సంపేటకు వెళ్తుండగా పోలీసులు రేవంత్ ను అడ్డుకున్నారు. దీంతో ఘట్కేసర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.  పోలీసులు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. తాను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిని అని ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని ఎలా అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తరలిస్తున్న వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News