Monday, December 23, 2024

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరూ అనే అంశంపై ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురూ చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన వెలువడింది. పార్టీ ఎమ్మెల్యేల తీర్మాణం మేరకు ఊహించినట్టు గానే రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తూ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ సుధీర్ఘ చర్చల అనంతరం అధిష్ఠానం రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. డిసెంబర్ 7 తేదీన సిఎంగా రేవంత్ రేడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర సిఎంగా రేవంత్ పేరు ఫైనల్ కావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఢిల్లీకి రావాలని కాంగ్రేస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చింది. అధిష్ఠానం పిలుపుమేరకు రేవంత్ ఢిల్లీకి బయలుదేరారు. డి.కె శివకుమార్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News