Monday, January 20, 2025

ఖబర్దార్ సిఎం రేవంత్… ఒళ్లు దగ్గర పెట్టుకో !

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని హెచ్చరించిన ఈటెల
వ్యాపారులను బెదిరించిన వసూళ్ల చిట్టా రికార్డ్ అవుతుంది
సిఎం పదవి చేపట్టిన నెలరోజుల్లో రెండు నాల్కల ధోరణి

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఖబర్దార్ అంటూ మల్కాజిగిరి బిజెపి ఎంపి అభ్యర్థి ఈటల రాజేందర్ హెచ్చరించారు. వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేసిన వసూళ్ల చిట్టా రికార్డ్ అవుతుందన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ నెల రోజుల్లో రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని. ప్రధాని మోడీ మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారని చెప్పిన సిఎం మళ్లీ మోడీని విమర్శించడం చూస్తే మాజీ సిఎం కెసిఆర్ బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

కెసిఆర్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారని విమర్శించిన రేవంత్‌రెడ్డి కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అప్రజాస్వామికం వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ…పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పార్టీ నిధులు పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంత వేధిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందని స్పష్టత ఇచ్చారు. ఒక్క రాష్ట్రంలో ఉండి తానే అనుకుంటున్నావని, నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారని మర్చిపోకు అని రేవంత్‌కు చురకలు వేశారు. మల్కాజిగిరిలో ఎవరు వచ్చినా, ఎంత ఖర్చుపెట్టిన బిజెపి గెలుస్తుందని, అక్కడి ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ధీమా -వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఏనాడు అలవికాని హామీలు ఇవ్వలేదని, దేశ చరిత్రలో ఎక్కడా లేనన్ని హామీలు ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిందని విమర్శలు చేశారు. మా పాలన నచ్చితే 370 సీట్లు ఇవ్వాలని, ఎన్‌డిఏ కూటమికి 400 సీట్లు ఇవ్వాలని మోడీ కోరుతున్నారని పేర్కొన్నారు. ఎంత మెజారిటీ వచ్చినా తోడుగా వచ్చిన పార్టీలను విస్మరించకుండా ఎంతో గౌరవించారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News