Tuesday, December 24, 2024

రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తా: బండ్ల గణేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇవాళ టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బియోపిక్ తీస్తానని చెప్పారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బయోపిక్ సినిమా తీస్తానని వెల్లడించారు. ఎబివిపి నుంచి విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో బయోపిక్ తీస్తానని ప్రకటించారు. ఈ ప్రయాణం సినిమా స్టోరీకి ఏ మాత్రం తక్కువ కాదన్నారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News