Monday, January 20, 2025

రేవంత్ విజయంలో అన్నదమ్ముల పాత్ర

- Advertisement -
- Advertisement -

రేవంత్ విజయంలో ఆయన అన్నదమ్ములకూ భాగం ఉంది. రేవంత్ కు ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. తమ సోదరుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే, కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ తరపున ప్రచార బాధ్యతలను మిగిలిన ఆరుగురూ పంచుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, తమ సోదరుడి తరపున ప్రచారం చేశారు.

రేవంత్ పెద్దన్న భూపాల్ రెడ్డి ఎస్ఐగా పనిచేసి రిటైరయ్యారు. రెండో అన్న కృష్ణారెడ్డి కొంతకాలం సర్పంచ్ గా పనిచేశారు. తర్వాతి అన్న తిరుపతిరెడ్డి కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. కొడంగల్ లో రేవంత్ తరపున ప్రచార బాధ్యతలను మోసింది ఈయనే. ఇంకొక సోదరుడు జగదీశ్వరరెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఎన్నికల ప్రచారం చివరలో ఈయన అమెరికానుంచి వచ్చి సోదరుడి తరపున ప్రచారం చేశారు. ఇక మిగిలిన ఇద్దరు సోదరులు హైదరాబాద్ లో వ్యాపారంలో స్థిరపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News