నల్లగొండ: తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. నల్లగొండలోని నకిరేకల్ కాంగ్రెస్ ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదేళ్లు పాలించిన సిఎం కెసిఆర్ ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఏళ్లుగా నిరుద్యోగులు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రావాలంటే నిరుద్యోగులే కార్యకర్తలు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు తల్చుకుంటే కాంగ్రెస్‌కు 50 లక్షల మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌ను ఓడిస్తే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలన కంటే కెసిఆర్ పాలనలో అన్యాయం ఎక్కువ జరిగిందన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్ ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ వంద నోటు కాదని దొంగ నోటు అని చురకలంటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా బిఆర్‌ఎస్ రాదన్నారు. నల్లగొండ గడ్డా కాంగ్రెస్ పార్టీ అడ్డా అని ఆయన ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడా చూసినా నల్లగొండ యువకులే కనిపిస్తారన్నారు.
వాళ్లు తల్చుకుంటే కాంగ్రెస్‌కు 50 లక్షల మెజార్టీ: రేవంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -