Monday, December 23, 2024

రైతులు ఎదుగుతుంటే ఓర్వలేని రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చొప్పదండి:మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో రైతువేదికలో నిర్వహించిన రైతు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ మరోసారి బయట పెట్టిందని అన్నారు. కర్షకులకు 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దంటూ ప్రకటించిన కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని దుయ్యబట్టారు.

గతంలోను రైతులకు విద్యుత్ ఇవ్వకుండా గోస పెట్టారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ధరణి ఎత్తివేస్తామన్న రేవంత్ ప్రకటనతో రైతులందరు ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అజ్ఞానంతో రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందన్నారని ఆక్షేపించిన రేవంత్‌రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్‌తో దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదిగారని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కారెడ్డి, రుక్మాపూర్ సర్పంచ్ చిలుక లింగయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, నాయకులు గుడిపాటి వెంకటరమణారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News