Thursday, January 9, 2025

కెసిఆర్‌తో లాలూచీ నా రక్తంలోనే లేదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కెసిఆర్ తో లాలూచీ నా రక్తంలోనే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తుదిశ్వాస విడిచే వరకు కెసిఆర్ తో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ తేల్చిచెప్పారు. కెసిఆర్, కెటిఆర్ అవినీతిపై పోరాటం చేసింది తానే అన్నారు. తన నిజాయతీని శంకిస్తే మంచిది కాదన్నారు.

కెసిఆర్ సర్వం దారబోసిన రేవంత్ రెడ్డిని కొనలేరన్నారు. ప్రశ్నించే గొంతుపై దాడి చేస్తే కెసిఆర్ కు మద్దతు ఇచ్చినట్లే తెలిపారు. కెసిఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడమంటే ఇదేనా రాజేంద్ర? అని ప్రశ్నించారు. చర్లపల్లి జైల్లో కెసిఆర్ నిర్బంధించినా భయటపడనన్నారు. కెసిఆర్ తో కొట్టాడుతున్న మాపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో పరిణామాలు అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News