కాళేశ్వరంపై న్యాయ విచారణకు జడ్జిని ఇవ్వండని హైకోర్టును కోరామని.. కానీ, సిట్టింగ్‌ని ఇవ్వలేమని.. రిటైర్డ్ జడ్జిని ఇస్తామని చెప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం బిఎసి మీటింగ్ అనంతరం సిఎం రేవంత్ రెడ్డి.. చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ జడ్జితో కాళేశ్వరం విచారణపై అసెంబ్లీలో చర్చిస్తామని ఆయన చెప్పారు. మేడిగడ్డ మీద చర్చ పక్కదారి పట్టించేందుకే బిఆర్ఎస్ నేతలు ఎఆర్ఎంబి ఇష్యూను తెస్తున్నారని సిఎం మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయంమన్నారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని తెలిపారు.పలు
అంశాలు చర్చించాల్సిన అవసరం అనుకుంటే స్పీకర్ సభ పొడిగించవచ్చన్నారు. కెఆర్ఎంబికి ప్రాజెక్టులను గత ప్రభుత్వమే అప్పగించిందన్నారు. కృష్ణా బేసిన్ లో బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిగా తాను కేసీఆర్ ను కూడా కలుస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.