Sunday, February 16, 2025

నేను ప్రధానిని అలా అనలేదు.. క్లారిటీ ఇచ్చిన రేవంత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తాను ఎలాంటి వ్యక్తిగత కామెంట్లు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి కుర్చీని అగౌరవపరచలేదని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన యూత్‌ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన రేవంత్ మోదీ కులం గురించి వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన పుట్టుకతోనే బిసి కాదు, తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక తన కులాన్ని బిసిల్లో కలిపారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ పలువురు ప్రధాన నేతలతో సమావేశం అవుతున్నారు.

ఈ సందర్భంగా శనివారం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ, ఇతర అంశాలను ఆయన రాహుల్‌కి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కులగణన, ఎస్సీ వర్గీకరణలో తెలంగాణ దేశానికి రోల్‌ మోడల్. ఇక నేను మోదీ పుట్టుకతోనే బీసీ కాదని మాత్రమే అన్నాను. ఆయన పుట్టుకతోనే బిసి కాదు కాబట్టే బిసిల పట్ల చిత్తశుద్ధి లేదు అని అన్నాను. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే జనగణనలో కులగణన కూడా చేయాలి’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News