Sunday, December 29, 2024

ఉచిత విద్యుత్‌ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్లారిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలులో చేస్తున్న అవినీతిపై తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ పై తన వ్యాఖ్యలను వక్రీకరించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్ చేసిన తప్పుదారి పట్టించారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగద చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.

రైతులకు ఉచిత విద్యుత్ ను తీసుకువచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన గుర్తుచేశారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగినప్పుడు కెసిఆర్ తెలుగుదేశంలోనే ఉన్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు అని ఆనాడు కెసిఆర్ టిడిపి ప్రభుత్వంతో చెప్పించారని వెల్లడించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ దస్త్రంపైనే పెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సాగుకు 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉచిత విద్యుత్ తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చిందన్నారు. ఉచిత విద్యుత్ తో పాటు వేక కోట్లను ఇన్ పుట్ సబ్సీడీలుగా రైతుకు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తలు తీసుకుందన్నారు. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వచ్చేలా సోనియా గాంధీ చర్యలు తీసుకున్నారని రేవంత్ వెల్లడించారు. 40 శాతం జనాభా ఉన్న తెలంగాణకు 53శాతం విద్యుత్ కేటాయింపులు చేశారు. తెలంగాణ రైతులకు విద్యుత్ ఎంత ముఖ్యమో 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ ఆలోచించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News