Sunday, December 22, 2024

కార్మిక సమస్యలు వారికి పట్టవు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జయశంకర్‌భూపాలపల్లి: రాజకీయ పార్టీలే కాదు కార్మిక సంఘాలపై ప్రభుత్వాలు గుత్తాధిపత్యం సాధిస్తున్నాయని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కెటికె-5 ఇంక్లైన్ వద్ద సింగిరేణి కార్మికులతో రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సింగరేణి సమస్యలపై కార్మికులతో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. వేలాది కోట్లు కొల్లగొట్టేందుకు తప్ప కార్మిక సమస్యలు ప్రభుత్వాలకు పట్టవని విమర్శించారు.

ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అవిభక్త కవలల్లా ఇన్నాళ్లు కలిసి ఉన్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు వేరువేరని చెబుతున్నారని చురకలంటించారు. తెలంగాణ సాధించటమే కాదు…. కాపాడుకోవటం కార్మికుల బాధ్యత అని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సింగరేణి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ శాఖ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని ప్రశంసించారు.  సకల జనుల సమ్మెకు సైరన్ ఊది కార్మికులు నడుం బిగించడంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News