- Advertisement -
హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిజిపి, సిపికి సిఎం ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించమని హెచ్చిరంచారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధంలేని పోలీస్ సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై ఒయు జెఎసి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
- Advertisement -