హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి నేతలపై చాలా కేసులు ఉన్నాయని, వాటిలో ఇప్పటివరకు ఎందుకు తీర్పు రాలేదని ప్రశ్నించారు. అప్పీల్‌కు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 30 రోజుల గడువు ఇవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. లేకుంటే పోలీసులు ఎప్పుడో రాహుల్‌ను అరెస్టు చేసి ఉండేవారన్నారు. క్షమాపణలు చెబితే ఉరిశిక్షను నిలిపివేస్తామని భగత్ సింగ్‌ను బ్రిటిష్ వారు అడిగారని, భగత్ సింగ్ దేశ పౌరుషాన్ని ప్రపంచానికే తెలియజేయడానికే ఉరికంబం ఎక్కారన్నారు. ఇప్పటి వరకు గాంధీ కుటుంబానికి సొంత ఇళ్లు లేదన్నారు. డబుల్ ఇంజిన్ అంటే ఒకటి అదానీ, రెండు ప్రధాని మోడీ అని రేవంత్ చురకలంటించారు. రెండు సార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ తీసుకోలేదన్నారు. అదానీపై మాట్లాడినందుకే రాహుల్ గాంధీపై ఎంపిగా అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీని చూస్తే మోడీ భయపడుతున్నారు: రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -