Wednesday, January 22, 2025

పటేల్ కు దండేసే నైతిక హక్కు బిజెపికి లేదు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను, వీరులను స్మరించుకుంటూ.. వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే ఈ స్వేచ్ఛా అని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్ లో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ అంటేనే కాంగ్రెస్ అని,  భావప్రకటనా స్వేచ్ఛా వచ్చిందంటే అప్పటి వీరుల త్యాగాలేనని, వారిని స్ఫూర్తిగా తీసుకొని నిరంకుశత్వ పాలనకు నిలబడి కొట్లాడాలని,  భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులతో కలిసి పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు.

బ్రిటిష్ స్వామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను మొదలుపెట్టామని, బైరాంపల్లి ఘటనలు తెలంగాణలో చాలా జరిగాయని, భూమి కోసం భుక్తి కోసం దండు కట్టామని, దళంగా కదిలామని, వేలాది మంది వీరులు పోరాటం చేశారని ప్రశంసించారు. కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని, ముక్త భారత్ అని అంటున్నారని, దేశంలో వందలాది సంస్థానాలున్నాయి, కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం చేశారని, మూడు ప్రాంతాలైన హైదరాబాద్ రాష్ట్రము, జమ్మూకాశ్మీర్, గుజరాత్ లోని జునే ఘడ్ ను  వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని గా వున్నప్పుడు విలీనం చేశారన్నారు.

జునే ఘడ్ రాష్ట్రం భారత్ లో కలవమని పాకిస్థానంలో కలుస్తామని అక్కడి రాజు అన్నాడని,  ఆ రాజు కూడా ముస్లిం రాజేనని సర్దార్ వల్లభాయ్ పటేల్ వెళ్లి ఆ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు.   ముస్లిం హిందువుల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని బిజెపోళ్లు చూస్తున్నారని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చారని, పిఎం నరేంద్ర మోడీ ఆదేశాలతో సెప్టెంబర్ 17 వేడుకలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.  ఐతే ఆ రోజు కూడా నెహ్రు ఆదేశాల మేరకే పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేశారని, నెహ్రు ఆదేశాలమేరకు చేశారు ఆ నాటి హోమ్ శాఖ మంత్రి పటేల్ చేశారని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే నాయకులు, ఆ పార్టీ అప్పుడెక్కడ ఉందని రేవంత్ రెడ్డి అడిగారు.

బిజెపి అసలే పుట్టలేదని,  దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టేనని చెప్పారు. తమ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను బిజెపి దొంగిలించే ప్రయత్నం చేసిందని,  1950లో గాంధీ భవన్ కు పునాదులు వేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి పునాదులు వేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆ పటేల్ కు దండేసి నైతిక హక్కు కూడా బిజెపికి లేదని విమర్శించారు. దేశంలో విస్తరించడానికి మోడీ కుట్రలు చేస్తున్నారని విరుచుకపడ్డారు.

కార్పొరేట్ కంపెనీలకు దేశాన్ని మోడీ ప్రభుత్వం దోచుపెడుతుందని, విడగొట్టే పనిలో మీరున్నరు, కలిపే పనిలో తాము ముందు వరసలో ఉంటామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపోళ్లు వాట్స్ ఆప్ యూనివర్సిటీలో ఓవర్ నైట్ పని చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News