- Advertisement -
నల్లగొండ: మునుగోడు సమస్యలు ఎన్నడూ బిజెపి పట్టించుకోలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు సమస్యలపై కొట్లాడకుండా రాజగోపాల్ రెడ్డి మీ ఓట్లను అమ్ముకున్నాడని దుయ్యబట్టారు. మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢీల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టారని, అమ్ముడు పోయిన రాజగోపాల్ మళ్లీ కొట్లాడుతానంటే ప్రజలు నమ్మరన్నారు. మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో కొట్లాడే తెగువ మన ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికే ఉందన్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి సవాల్ ను విసిరితే రాజగోపాల్ రెడ్డి పారిపోయాడని, తడి గుడ్డతో గొంతు కోసే బిజెపి, తడిబట్టల ప్రమాణాలను జనం నమ్మరని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆడబిడ్డకు అవకాశం ఇవ్వాలని మునుగోడు ప్రజలను కోరారు.
- Advertisement -