హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ఎంఎల్‌ఎలు కెసిఆర్‌పై ఒత్తిడి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కెటిఆర్‌ను సిఎం చేసేందుకు సహకరించాలని కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కోరారని, ముఖ్యమంత్రిని మార్చే అంతర్గత వ్యవహారంలోనూ మోడీ అనుమతి కోరారని రేవంత్ తెలియజేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెచ్చిన అన్ని బిల్లులకు బిఆర్‌ఎస్ మద్దతు తెలిపిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. బిజెపి-బిఆర్ఎస్ ఒకటేనని చెప్పారు. గతంలో బిఆర్‌ఎస్ ముగ్గురు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ ఓటేశారని, దీంతో ముగ్గురు ఎంఎల్‌ఎలను కెసిఆర్ సస్పెండ్ చేశారని రేవంత్ పేర్కొన్నారు. ఈ ముగ్గురిని అల్లుడు హరీష్‌రావే కాంగ్రెస్‌కు ఓటేయాలని చెప్పిన విషయాన్ని సభలో తెలియజేశారు.
ఆ సీక్రెట్లను బయటపెట్టిన రేవంత్
- Advertisement -
- Advertisement -
- Advertisement -