Thursday, January 23, 2025

ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసిన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో భేషజాలకు వెళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని కొనియాడారు. కాంగ్రెస్ దూరదృష్టి నిర్ణయాలతోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని స్పష్టం చేశారు. రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్‌కు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 11.3 కిలో మీటర్లు పొడవున 6 లేన్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రెండో దశలో 75 కిలో మీటర్ల మెట్రో విస్తరణ చేపట్టబోతున్నామని వివరించారు. బిఆర్‌ఎస్ హయాంలో భాగ్యనగరంలో గంజాయి, పబ్బులు, డ్రగ్స్ వచ్చాయని, కెసిఆర్ పాలనలో అభివృద్ధి జరిగింది ఏం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల అవసరాలను మర్చిపోయిందని, కెటిఆర్ సెల్ఫీలు దిగే శిల్పారామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని రేవంత్ చురకలంటించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, ఎన్నికలయ్యాక తెలంగాణ అభివృద్ధే ధ్వేయంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News