Sunday, January 19, 2025

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డిజిపి జితేందర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని, తెలంగాణలో అధికారం కోల్పోయామనే అక్కసుతోనే బిఆర్‌ఎస్ నేతలు ఉన్నారని చురకలంటించారు. కొందరు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నాలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా కుట్రలకు తెరలేపుతున్నారని,  రాజకీయ కుట్రలు సహించేది లేదని మండిపడ్డారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలని, హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసే పనిలో బిఆర్‌ఎస్ ఉందని, తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంపై సమీక్ష జరపాలని డిజిపికి సిఎం ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News