Thursday, January 23, 2025

పేదలకు మేలు జరగదు.. శ్రీమంతులకే ప్రయోజనం…

- Advertisement -
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌పై రేవంత్ విసుర్లు

Revanth Reddy is contesting from Kodangal in 2023 Polls

 

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పేదలకు మేలు జరగదని, కేవలం శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వంటి అంశాలను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. జిఎస్టీ సహా ఆదాయపన్ను రేట్లు, స్లాబులు మార్చకపోవడంతో సామాన్యులకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకించినందుకు.. రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీని తగ్గించారని విమర్శించారు.

పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించామని ఆయన అన్నారు. రైతుల పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదని, కేంద్ర బడ్జెట్ నిరాశపరించినందన్నారు. అలాగే ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారని, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయలేదు.. పంట పెట్టుబడి వ్యయాన్ని రెండింతలయ్యేలా ఎరువుల సబ్సిడీ తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త రాజ్యాంగం తేవాలన్న ప్రభుత్వ ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతోందా? అని ప్రశ్నించారు.

బిజెపి ఆలోచనలనే ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బిజెపి మరోసారి ఆలోచించాలని అన్నారు. దాదా సాహబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రద్దు చేసి..జ రాజులు, సామంతులు, భూస్వాములకు అనుకూలమైన రాజ్యాంగాన్ని తీసుకురావాలని బిజెపి, టిఆర్‌ఎస్‌లు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారన్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు గానీ, నిరుద్యోగులకు గానీ అనువైన నిర్ణయాల్లేవనీ, వైద్య మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులు లేవని, కరోనా ప్రభావం చూపాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపుల్లేవన్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఆరోగ్యం ఎవరికి ఉపయోగపడే నిర్ణయాలు లేవని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News