హైదరాబాద్: అణచివేతకు గురవుతున్న వారికి అండగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారనితెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లడుతూ… కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా మంది స్వాగతించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై పోరాడతానని సిఎం కెసిఆర్ చెప్పారు. కర్నాటక కాంగ్రెస్ గెలుపు.. గెలుపు కాదని కెసిఆర్ అంటున్నారని తెలిపారు.
కర్నాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందన్నారు. మోడీకి ఎదురొడ్డి నిలస్తానని కెసిఆర్ చెప్పుకుంటూ వచ్చారు. మోడీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని మమత కోరుతున్నా విషయాన్ని ఆయన సూచించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కెసిఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేదని రేవంత్ పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కెసిఆర్ కు కంటగింపుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరూ మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికే వస్తారంటూ రేవంత్ జోస్యం చెప్పారు.