Monday, January 20, 2025

కెసిఆర్ ధనదాహానికి బలైపోయింది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపోయాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. బిఆర్ఎస్, బిజెపి కలిసిపోయినందునే కాళేశ్వరంపై కేంద్రం స్పందించట్లేదని రేవంత్ మండిపడ్డారు. బిఆర్ఎస్, బిజెపి ఒక్కటి కాకుంటే… కాళేశ్వరంపై విచారణకు ఆదేశించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కెసిఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోందన్నారు. కెసిఆర్ గొప్ప ఇంజినీరుగా చెప్పుకొని రూ. లక్ష కోట్లు వృథా చేశారని రేవంత్ పేర్కొన్నారు. ప్రాజెక్టుపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపించాలన్నారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారాలతో దూసుకుపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News