Thursday, January 23, 2025

మెగా డిఎస్‌సి కాదు…దగా డిఎస్‌సి : రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మెగా డిఎస్‌సి ప్రకటించాలని అభ్యర్ధులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది మెగా డిఎస్‌సి కాదు… ఎన్నికల కోసం ప్రకటించిన దగా డిఎస్‌సి అని సెటైర్ వేశారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయని, నోటిఫికేషన్‌లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. చేతి గుర్తు మా చిహ్నం, చేసి చూపించడమే మా నైజం అని ట్వీట్ చేశారు. ’కారు’ కూతలు రావు’జూటా’ మాటలు లేవు అని బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించామని ఆయన పేర్కొన్నారు. మా బాట ప్రజా సంక్షేమమని, వస్తున్నాం తెలంగాణలోనూ, అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలను,

మోసుకొస్తున్నాం చిరునవ్వులనుఅని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ .200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News