Monday, December 23, 2024

దశాబ్ది దగానే: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని టిపిసిసి, ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. దశాబ్ధి దగా పేరుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టాయి. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కచ్చితంగా దశాబ్ది దగానే అని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క హామీనైనా పూర్తిగా అమలు చేశారా? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే మోసాలను తాము ప్రశ్నిస్తే అరెస్టులా? అడిగారు.

Also Read: కుక్కతో పాప బంతి ఆట… వీడియో వైరల్

ప్రజల హక్కును బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు దుర్మార్గమని చర్య అని మండిపడ్డారు. అరెస్టైన నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News