Monday, January 20, 2025

కెసిఆర్ భయపడుతుండు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ధరణిని రద్దు చేస్తాంటే కెసిఆర్ భయపడుతున్నారని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ధరణి విషయంలో కెసిఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన విధానం తీసుకువస్తాయని రేవంత్ స్పష్టం చేశారు. కెసిఆర్ చేసిన భూ అక్రమాలను కూడా బయటపెడతామని ఆయన వెల్లడించారు. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత వెల్లడిస్తానన్నారు.

ధరణి పోర్టల్ మొత్తం కెటిఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె చేతిలో ఉందన్నారు. నిషేధిత జాబితా భూములను అనుచరులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసి వెంటనే ప్రొహిబిషన్ ను లాక్ చేస్తున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థలో విదేశీయులు ఉన్నారన్న రేవంత్, ధరణి పోర్టల్ మన వివరాలన్నీ విదేశీయుల చేతిల్లోకి వెళ్తున్నాయని ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు విదేశీ ఆర్థిక నేరగాళ్లని రేవంత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News