Monday, December 23, 2024

ఎగ్జిట్ పోల్స్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు పదేళ్లుగా పట్టిన పీడ తొలగిపోయిందన్నారు. ఓటమి ఖాయమని తెలిసినప్పుడల్లా కెసిఆర్ నియోజకవర్గం మార్చారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 3కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. శ్రీకాంత్ చారి తుదిశ్వాస విడిచారన్నారు. శ్రీకాంత్ చారి ఘటనతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తుచేశారు. డిసెంబర్ 3న దొరల తెలంగాణ అంతమవుతుందన్న రేవంత్ తెలంగాణ ప్రజల చైతన్యం మీద తమకు నమ్మకం ఉందద్నారు. బిఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం అని రేవంత్ మండిపడ్డారు. ప్రజలంటే బిఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News