Wednesday, January 22, 2025

ఐఏఎస్‌ అధికారులపై రేవంత్‌ ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ కోసం కొందరు ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవీ విరమణ పొందిన అధికారులు, బిఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న అధికారులను అనేక స్థానాల్లో మోహరించడంపై రేవంత్ విమర్శలు గుప్పించారు.

“ఎన్నికల్లో అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని, అయితే గత కొన్నేళ్లుగా, బిఆర్ఎస్ పార్టీ నాయకుల కంటే కూడా ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు బిఆర్ఎస్ కోసం ఎక్కువగా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలకు సంబంధించి తప్పుడు సమాచారం లేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలవరపరిచే వార్తలను ప్రసారం చేసే రిపోర్టర్లు, మీడియా అధికారులపై తెలంగాణ కాంగ్రెస్ న్యాయపోరాటం చేస్తుందని రేవంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News