Monday, December 23, 2024

ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ ఓట్లు అడుగుతోంది: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఆదిలాబాద్ లో సాగునీరు ఇచ్చేందుకు ప్రాణహిత- చెవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ చేపట్టిందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో కాంగ్రెస్ విజయ భేరి సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆదిలాబాద్ కు సాగునీరు వచ్చేదన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే… తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు కడితే కమీషన్లు రావని కెసిఆర్ భావించారని రేవంత్ ఆరోపించారు.

రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు ఖర్చు రూ. లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 25 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని తెలిపారు. పేదలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇస్తామని అందమైన కలలు చూపించారని మండిపడ్డారు. ఈ పదేళ్లలో ఎంతమందికి రెండుపడకల గదుల ఇళ్లు ఇచ్చారో కెసిఆర్ చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని ఆయన వెల్లడించారు. రెండు పడకగదుల ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కెసిఆర్ ఓట్లు అడగాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News