Monday, December 23, 2024

కాళేశ్వరం.. కెసిఆర్ కుటుంబానికి ఎటిఎం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చేప్పారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిమండిపడ్డారు. రైతులను బస్సుల్లో తీసుకెళ్లి కాళేశ్వరం చూపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంపుహౌసులు మునిగినప్పుడు కాంగ్రెస్ నేతలను వెళ్లనివ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు వరదలు లేకుండానే ప్రాజెక్టు ఎందికు కుంగిపోయిందని రేవంత్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు డొల్లతనం, నిజస్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు.

కాళేశ్వరం… కెసిఆర్ కుటుంబానికి ఎటిఎంగా మారిందని చెప్తూనే ఉన్నాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఇప్పటికైనా విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం డిజైన్ రూపొందించానని కెసిఆర్ ఎన్నోసార్లు చెప్పుకున్నారన్నారు. కుంగిన తర్వాత మాత్రం మాకు సంబంధం లేదని అంటున్నారని ఫైర్ అయ్యారు. నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News