Wednesday, January 22, 2025

కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రాబోతున్నాయి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు గెలుచుకుంటుందని తాను గతంలో జోస్యం చెప్పానని, ఎన్నికల అధికారుల తుది ఫలితాల కోసం వేచి చూస్తానని అన్నారు. కర్నాటక ఫలితాలే రేపు తెలంగాణలోనూ రాబోతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నీలోఫర్ వద్ద హనుమాన్ దేవాలయంలో రేవంత్ పూజలు చేశారు. భజ్ రంగ్ బలిని అడ్డుపెట్టుకుని బిజెపి గెలవాలనుకుందని ఆయన తెలిపారు. శ్రీరాముడిని అవమానించిన వారిని భజ్ రంగ్ బలి ఆశీర్వదించడు అని రేవంత్ తెలిపారు. విద్వేష విభజన రాజకీయాలకు కన్నడ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News