Wednesday, January 22, 2025

కెసిఆర్ 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి అధికారి రోజు రెండు గ్రామాలను సందర్శిస్తారని తెలియజేశారు. ఆరు గ్యారంటీల అభయహస్తం లోగోను సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు.  గడీల మధ్య జరిగిన పాలనను గ్రామాలకు తీసుకవస్తున్నామని, జనవరి 7 లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నామని, పథకాలను ప్రజలందరికీ చేరవేసేందుకు కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ కెటిఆర్‌ను కలిసినట్లు తెలిసిందని, బాధిత మహిళకు కెటిఆర్ లక్ష రూపాయలు అందించినట్లు తెలిసిందని, కెటిఆర్ దోచుకున్న రూ. లక్ష కోట్లతో బాధితురాలికి లక్ష రూపాయలు ఇచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు.

దోచుకున్న సొమ్ము మొత్తం ప్రజలకు చేరేలా చేస్తామని హామీ ఇచ్చారు. కెసిఆర్ హయాంలో 22 కొత్త కార్లు కొని దాచి పెట్టారని, మూడోసారి అధికారంలోకి వస్తే కార్లు వాడుదామనుకున్నారని ఎద్దేవా చేశారు. ల్యాండ్ క్రూజర్లు ధర రూ.3 కోట్లు ఉంటుందని, ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టారని మండిపడ్డారు. ఐటిఐఆర్ కారిడర్ వెనక్కి పోతే మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News