Thursday, March 13, 2025

అసెంబ్లీలో చర్చకు కెసిఆర్ రావాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని, అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడంలేదని  అందుకే ఆయనను ప్రశ్నిస్తున్నానని వివరణ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో సిఎం మీడియాతో మాట్లాడారు. డిలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్‌గా మారిందని వాపోయారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని, తానెవరో తెలియకుండానే పిసిపి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎవరి ట్రాప్‌లో పడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తుండడంతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కలుస్తానని రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సమ్మిట్ 60 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారని, అమెరికా నుంచి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయని, నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News