Monday, December 23, 2024

మంత్రి చెప్పకుండా పీఏ సొంతంగా అక్రమాలు చేయరు: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి చెప్పకుండా పిఎ సొంతంగా అక్రమాలు చేయరని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిట్ చెప్పాల్సిన విరాలు మంత్రి కెటిఆర్ ఎలా చెప్పున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాశారు. పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో కెటిఆర్ చెప్పారు. కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే వివరాలన్నీ కెటిఆర్ ఎలా చెప్పారు? అని రేవంత్ ప్రశ్నించారు. సిట్ అధికారి అయినట్లు మంత్రి కెటిఆర్ వివరాలన్నీ ఎలా చెప్పారు. మంత్రి కెటిఆర్ కనుసన్నల్లోనే దర్యాప్తు జరుగుతోందని ఆయన ఆరోపించారు. కెటిఆర్ వివరాలన్నీ నిందితులు చెప్పారా? సిట్ అధికారి చెప్పారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News