Wednesday, January 22, 2025

మంత్రి హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరీశ్ రావుకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. వార్డు మెంబర్ గా కూడా గెలవని హరీశ్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. 2009లో టిడిపితో పొత్తు పెట్టుకున్నది కెసిఆర్ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. కెసిఆర్ జీవితమంతా కాంగ్రెస్, టిడిపిపైనే ఆధారపడ్డారని ఆయన వెల్లడించారు. టిఆర్ఎస్ మొట్టమెదటగా నిధుల సాయం చేసింది.. టిడిపి నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్న విషయాన్ని రేవంత్ బయటపెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News